హత్నురలో బంద్‌ ప్రశాంతం

హత్నూర: విద్యుత్తు ఛార్జీల పెంపునకు నిరసనగా విపక్షాలు చేపట్టిన బంద్‌ మండలంలో ప్రశాంతంగా జరిగింది. పరిశ్రమలు బంద్‌ను పాటించాయి. సీపీఎం, సీపీఐ, తెదేపా, వైకాపా నాయకులు దౌల్తాబాద్‌లో ద్విచక్రవాహన ర్యాలీని నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారిపై దాదాపు రెండుగంటలపాటు రాస్తారోకో చేశారు. దీంతో వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఎస్సై భరత్‌ కుమార్‌ ఆందోళనకారులను అరెస్టుచేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుతో వదిలిపెట్టినట్లు ఎస్సై తెలిపారు.