హన్మాజీపేట్ కు ఉదయం సాయంత్రం బస్సు సౌకర్యం కల్పించాలి
సర్వసభ్య సమావేశంలో పలు తీర్మానాలు
బాన్సువాడ, జనంసాక్షి (జూలై 16):
హన్మాజీపేట్ గ్రామానికి ఉదయం సాయంత్రం బస్సు సౌకర్యం కల్పించాలని ఎంపీటీసీ సుధాకర్ రెడ్డి సమావేశంలో ప్రస్తావించారు. శనివారం బాన్సువాడ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నీరజ వెంకట్ రామ్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఇబ్రహీంపేట తండాలో 45 రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదని సర్పంచ్ ప్రేమ్ సింగ్ తెలిపారు. ఇబ్రహీంపేట గ్రామానికి వచ్చే భగీరథ పైప్ లైన్ పలుచోట్ల ధ్వంసమయ్యాయి సర్పంచ్ నారాయణ రెడ్డి అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మండలంలోని అంగన్వాడీ కేంద్రాలను క్రమం తప్పకుండా పరిశీలించాలని ఎంపీపీ నీరజ సూపర్వైజర్ ఆదేశించారు. గ్రామాలలో విద్యుత్ స్తంభాలు, సబ్ స్టేషన్ లకు టాక్స్ లు వసూలు చేయాలని, గ్రామస్థాయి అధికారులు ప్రతిరోజు క్రమం తప్పకుండా పంచాయతీ కార్యాలయంలో రిజిస్టర్లో సంతకాలు చేసి విధులకు హాజరు కావాలని సభ్యులు తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, జిల్లా రైసస సమన్వయకర్త అంజి రెడ్డి, బాన్సువాడ, బొర్లం సొసైటీ చైర్మన్ లు కృష్ణారెడ్డి, సంగ్రామ్ నాయక్, వైస్ ఎంపీపీ హరి సింగ్, తహసిల్దార్ గంగాధర్, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
Attachments area