హమాలీ రాష్ట్ర మహాసభ ను జయప్రదం చేయండి..ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.జనార్ధన్

రాజాపేట, అక్టోబర్21(  జనంసాక్షి) : తెలంగాణ ప్రగతిశీల హమాలీ, మిల్ వర్కర్స్ ఫెడరేషన్, ఐ ఎఫ్ టి యు రాష్ట్ర మూడవ మహాసభ ను 2022,అక్టోబర్ 31 న ఆలేరు కమలమ్మ జనార్ధన్ గార్డెన్స్ లో నిర్వహిస్తున్నామని,హమాలీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.జనార్ధన్, ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి, శక్తి హమాలీ వర్కర్స్ యూనియన్ రాజా పేట అద్యక్షుడు రేగు శ్రీశైలం లు కోరారు.
శుక్రవారం  కొండ్రెడ్డిచెరువు, పాముకుంట, రాజా పేట మండల కేంద్రంలో హమాలీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహాసభ కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా, జనార్ధన్,శ్రీశైలం లు మాట్లాడుతూ,రాష్ట్ర హమాలీ మహాసభకు రాష్ట్ర వ్యాపితంగా నూటయాభై మంది కార్మికులు పాల్గొంటారని, రాష్ట్రంలో హమాలీ కార్మికుల కడు దయనీయమైన పరిస్తితులను, జీవనం విధానం గురించి,హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డ్ ,గుర్తింపు కార్డులు, పించన్లు, ఈ ఎస్ ఐ, పీ ఎఫ్ సౌకర్యం తదితర సమస్యల పరిష్కారం కోసం భవిషత్ పోరాట కర్తవ్యాలను రూపొందించుకోవడం జరుగుతుందని,రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హమాలీ యూనియన్ నాయకులు కాకళ్ళ కనకయ్య, యెమ్మ బాలరాజు, తోకల నర్సింహులు,నాయిని మైసయ్య,గజం కిష్టయ్య, బైకని బిక్ష పతి,మేక రమేష్,రంజిత్,పాండు, పర్వతాలు,తదితరులు పాల్గొన్నారు.