హరితహారం కోసం పెద్ద ఎత్తున ప్రచారం
సిద్దిపేట,జూలై28(జనం సాక్షి): సీఎం కేసీఆర్ పాల్గొనే హరితహారం కోసం గజ్వెల్‌లో ప్రాచారం ఉదృతంగా చేపట్టారు. ఇంఒంటింటికి ప్రచారం చేస్తున్నారు. గజ్వేల్ మున్సిపాలిటీని ఆకుపచ్చగా మార్చాలనే ఉద్దేశంతో చేపట్టిన హరితహారంలో అన్నివర్గాల ప్రజ లను భాగస్వాములు చేయాలన్నారు. నాలుగో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఒకే రోజు లక్షా 116 మొక్కలనునాటనున్నారు. గజ్వేల్ పట్టణంలో ఆగస్టు 1తేదీన నాటే బృహత్తర కార్యక్రమానికి ఇంటింటికీ తిరిగి మహిళలకు కుంకుమతిలకం దిద్ది ఆహ్వానించాలని నిర్ణయించారు. గడ ఓఎస్డీ హన్మంతరావు పర్యవేక్షణలో కార్యక్రమం ముందుకుసాగుతోంది. హరితహారంపై ఉపాధ్యాయులు, కౌన్సిలర్లు, అధికారులతో సవిూక్ష సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. దీంతో మొక్కలు నాటేందుకు కావాల్సిన కూలీలను ఇతర మండలాల నుంచి తీసుకువచ్చి గుంతలు తీసే కార్యక్రమాన్ని చేపడుతున్నాన్నారు. ముఖ్యంగా మహిళలను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో ప్రతి వార్డుకూ 50మంది చొప్పున మహిళలను నాలుగు రోజుల పాటు గడపగడపకూ తిరిగి చైతన్యవంతులను చేస్తున్నారు. ప్రతి ఇంటికీ పంపిణీ చేసే 7మొక్కలు ఇంటి ఆవరణలో నాటే విధంగా చూడాలని, ఇందులో పండ్లు, పూలమొక్కలతో పాటు వివిధ రకాల మొక్కలను అందజేస్తామన్నారు. సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం పలుకడంతో పాటు హరితహారం చరిత్రలో నిలిచి పోయే విధంగా అన్నివర్గాల ప్రజలు పాల్గొని మొక్కలు నాటాలని, దేశంలోనే గజ్వేల్ హరితవనంలో మొదటిస్థానంలో ఈ పథకం ద్వారా నిలుస్తుందన్నారు.



