హరితహారం కోసం ప్రత్యేక ఏర్పాట్లు: కలెక్టర్
నల్లగొండ,జూలై12(జనం సాక్షి): నాలుగో విడత హరితహారం కోసం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. లక్ష్యాన్ని సాధించేందుకు అందరినీ భాగస్వామ్యం చేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొనేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఇప్పటికే అధికారులకు తగిన సూచనలు ఇచ్చామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేసి విజయవంతం చేయాలని అన్నారు. రాష్టాన్న్రి స్వచ్ఛ తెలంగాణగా తీర్చిదిద్దడమే టీఆర్‌ఎస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు. మండల వ్యాప్తంగా 2 లక్షల మొక్కలు నాటి వాటిని సంరక్షించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ అన్నారు. మొక్కలకు కావాల్సిన గుంతలు పూర్తి చేసి మొక్కలు, వాటి రక్షణకు ఉపయోగించూ కంచె తదితర ఏర్పాట్లు పూర్తయ్యాయని అన్నారు. ఎన్నుకున్న ప్రదేశాలకు ప్రతి ఒక్కరు చేరుకోవాలని, 12వ తేదీన స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులను ఆహ్వానించి కార్యక్రమాన్ని ప్రారంభించు కోవాలన్నారు. నాణ్యమైన మొక్కలు అందుబాటులో ఉంచుకోవాలని, గ్రామాల్లో వాటి సంరక్షణ బాధ్యత గ్రామ హరితరక్షణ కమిటీలు తీసుకోవాలని సూచించామని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, రైస్‌మిల్లులు పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు ముందుకురావాలని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు డేటా ఎంట్రి పూర్తి చేయాని అధికారులు వారికి కేటాయించిన లక్ష్యం డేటాను పూర్తి చేయాలన్నారు. ఒక మండలానికి లక్ష మొక్కలు తక్కువ కాకుండా నాటేందుకు చర్యలు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టామని అన్నారు. జిల్లాలో 31 మండలాల్లో 502 గ్రామ పంచాయతీలు ఉన్నాయని వాటితోపాటు అన్ని పాఠశాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
———–