హరితహారం మొక్కలు ఎదిగేలా చూడాలి

రక్షణ ఏర్పాట్లు ప్రధానం కావాలన్న జోగు

ఆదిలాబాద్‌,జూలై23(జ‌నంసాక్షి): హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు ఎండిపోకుండా కాపాడాలని మంత్రి జోగురామన్న అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని మంత్రి రామన్న అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 230కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యం పెట్టుకున్నామన్నారు. వివిధ శాఖల అధికారులకు కేటాయించిన మొక్కలన్నింటినీ గడువులోగా నాటించాలన్నారు. పలుచోట్ల నాటిన మొక్కలు మొలకెత్తక పోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రావిూణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క రూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని, ప్రభుత్వం పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని మంత్రి అన్నారు. మరుగుదొడ్లు, తాగునీటి, వంటశాలతోపాటు పాఠశాల పరిసరాల ప్రాంతాలను పరిశీలించారు. ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చదివించి తల్లిదండ్రులు ఆర్థికంగా నష్టపోవద్దన్నారు. నిరుపేద ప్రజలు ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి హావిూ పనులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి జోగురామన్న అన్నారు. గ్రామాల్లో ఉపాధి హావిూ పనులను సక్రమంగా నిర్వహించాలని అన్నారు. భారీ నిర్మాణ పనులను పరిశీలించి వివరాలను సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకొన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో చాలా మంది ఉపాధి హావిూ పనుల్లో ఎలాంటి పనులు ఉన్నాయో తెలియక పనులు చేసే అవకాశం కోల్పోతున్నారని మంత్రి అన్నారు. ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఇకపై పనులు చేయబోయే ముందు రోజు సంబంధిత గ్రామాల్లో తప్పని సరిగా సమావేశాలు నిర్వహించాలన్నారు. కూలీలకు ఎప్పటికప్పుడు డబ్బులు వచ్చేలా చూడాలని ఆదేశించారు.