హరిత ఉద్యమంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలి
సిద్దిపేట,ఆగస్ట్28(జనం సాక్షి): హరిత ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్ రెడ్డి కోరారు. మొక్కలు నాటడం సామాజిక బాధ్యతగా గుర్తించాలని అన్నారు. నాటిన మొక్కలను ప్రతి ఒక్కరూ సంరక్షించాలని చెప్పారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. హరితహారం కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.గత పాలకులు ప్రజల గురించి పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ భవిష్యత్ తరాల గురించి కూడా ఆలోచిస్తున్నరని అన్నారు. సిద్దిపేటలో నేడు ఒకేరోజు 50 వేల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టగా అందులో ఆయన మంత్రలుతో పాటు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, జోగురామన్న, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్. మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, అధికారులు పాల్గొని మొక్కలను నాటారు. మనందరి భవిష్యత్ బాగుండాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పేర్కొన్నారు.



