‘హరీష్ కు ఆ అర్హత లేదు’
రాష్ట్రంలో ఉన్నది గాంధీ పాలనా లేక గాడ్సే పాలనా అని జగ్గ్గారెడ్డి విమర్శించారు. అహింసా మార్గంలో చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం అణగదొక్కుతోందని, బాధితులకు న్యాయం చేయాలని చేస్తున్న దీక్షలను భగ్నం చేస్తోందని ఆయన ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ‘నేను తెలంగాణ ద్రోహిని అయితే.. తలసాని, తుమ్మల, కడియం, మహేందర్‌రెడ్డి ఏమవుతారని’ ప్రశ్నించారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు పనులు అమ్ముకున్న మీరా తెలంగాణ ద్రోహులు నేనా.. త్వరలోననే తెలంగాణ ద్రోహులెవరో తెలిపోతుందన్నారు. హరీష్‌రావుకు నన్ను విమర్శించే హక్కు లేదని.. ప్రతిసారి హైకోర్టుతో మొట్టికాయలు వేయించుకునే బదులు భూసేకరణ చట్టన్ని అమలు చేయొచ్చు కదా అని అన్నారు.