హాకీ ఇండియా లీగ్‌లోకి రాజీవ్‌శుక్లా, అరుణ్‌జైట్లీ
న్యూఢిల్లీ, జూలై 26 : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులో కీలకపదవుల్లో ఉన్న ఐపీఎల్ చైర్మన్ రాజీవ్‌శుక్లా, వైస్ ప్రెసిడెంట్ అరుణ్‌జైట్లీ ఇకపై హాకీ అభివృద్ధిలోనూ తమ పాత్ర పపోషించనున్నారు. హాకీ ఇండియా త్వరలో ప్రారంభించనున్న హాకీ ఇండియా లీగ్‌లోకి బోర్గు మెంబర్లుగా వ్యవహరిస్తారు. ఈ విషయాన్ని హాకి ఇండియా సెక్రటరీ, లీగ్‌లో బోర్డు మెంబర్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలోనే హాకీ ఇండియా లీగ్ ప్రారంభిస్తున్నారు. ఇటీవలే రెబల్‌లీగ్ వరల్డ్ సిరీస్ హాకీ కంటేభారీ స్థాయిలో నిర్వహించాలని హెచ్‌ఐ భావిస్తోన్న నేపథ్యంలో పలువురు సహకారం తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే ఐపీఎల్‌ను సక్సెస్‌పుల్‌గా నడిపిస్తోన్న శుక్లా, జైట్లీలను లీగ్‌లో భాగం చేయాలని నిర్ణయించారు. దీనిపై గతంలోనే వీరిద్దరినీ హాకీ ఇండియా ప్రత్యేకంగా కోరినట్టు తెలుస్తోంది. తమ కోరికను మన్నించి రాజీవ్‌శుక్లా, అరుణ్‌జైట్లీ బోర్డు సభ్యులగా పేరున్న వీరిద్దరూ తమ లీగ్‌కు కచ్చితంగా ఉపయోగపడతారన్నది హాకీ ఇండియా ఆలోచన. ఐపీఎల్ చైర్మన్‌గానూ, బీసీసీలో కీలకపాత్రదారిగా ఉన్న రాజీవ్‌శుక్లా హెచ్‌ఐఎల్ అభివృద్ధి కోసం కృషిచేస్తారని చెప్పారు. అలాగే స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్‌గా ఎంతో అనుభవం ఉన్న అరుణ్‌జైట్లీ కూడా హెల్ప్‌వుతారని భావిస్తున్నారు. వీరిద్దరితో పాటు మీడియాతో మంచి సంబంధాలున్న రజత్ శర్మ కూడా మరో మెంబర్‌గా ఉండనున్నారు. జాతీయ క్రీడ హాకీలో తామూ భాగం కావడంపై శుక్లా ఆనందం వ్యక్తం చేశారు. హాకీ ఇండియా లీగ్ సూపర్‌గా సక్సెస్ కార్యక్రమాలు సిద్ధం చేస్తామని శుక్లా వెల్లడించారు. అటు తాను కూడా హాకీని మంచి అభిమానినని, హెచ్‌ఐఎల్ డెవలప్‌మెంట్ కోసం పాటుపడతామని అరుణ్‌జైట్లీ స్పష్టంచేశారు.