హావిూల అమలుకు పోరాటం: ఆచారి
మహబూబ్‌నగర్,జూలై20(జనం సాక్షి): ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్ ఇచ్చిన హావిూల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు బీజేపీ పోరాటం చేస్తోందిన బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఆచారి పేర్కొన్నారు. డబుల్ బెడ్‌రూం, దళితులకు మూడెకరాల భూపంపిణీ, రైతుల రుణమాఫీ, ఫీజురీయింబర్స్‌మెంట్ విడుదలలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఉపాధి హావిూ పథకంలో వ్యవసాయ కార్మికులకు మరో 50 పని దినాలు పెంచారని, రాష్టాన్రికి కేంద్రం నిధులు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.300 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్టాన్న్రి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆర్థిక సాయం అందించి ఆదుకుంటోందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సాయం అందించటంతో పాటు గ్రావిూణ వ్యవస్థలో సమూలు మార్పులు తెచ్చేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు. రైతుల దుస్థితిని మార్చేందుకు ‘ప్రధాన మంత్రి కృషి సంచాయ్ యోజన పథకం’ అమలు చేస్తోందన్నారు.కాంగ్రెస్, కమ్యూనిస్టులు తమ మౌలిక సిద్ధాంతాలు వదిలేసి పెద్ద కేందరం తీసుకున్న జిఎస్టీ నిర్ణయాలను రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతోందని, టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ ఎదుగుతోందని చెప్పారు.