హాస్పిటల్ కార్మికులకు పెంచిన జీతాలు ఇవ్వాలి
పల్లా దేవేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి,
నల్గొండ బ్యూరో, జనం సాక్షి
ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డు లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కొత్త జీతాలను వెంటనే అమలు చేయాలని ఏఐటియుసి మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మిర్యాలగూడలో జరిగిన మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేతనాల పెంచాలని ఎన్నో పోరాటాలు చేసి తాత్కాలికంగా జీవో 60 సాధించడం జరిగిందని పేర్కొన్నారు. పెరిగిన వేతనాల జీవో నెంబర్ 60 ప్రకారం వెంటనే అమలు చేయాలని ఆయన అధికారులు కోరారు. కొత్త టెండర్ల ప్రకారం వెంటనే అగ్రిమెంట్ చేసుకుని జివో ప్రకార వేతనాలు ఇచ్చే విధంగా కాంట్రాక్టర్ను ఆదేశించాలని దేవేందర్ రెడ్డి కోరారు. పెరుగుతున్న ధరలతో పోల్చుకుంటే కార్మికులకు వచ్చే వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆ తక్కువ జీతాలతో వాళ్ళ కుటుంబాలు గడవడం ఇబ్బందికరంగా ఉందని అన్నారు. గతంలో విడుదల చేసిన జీవో నెంబర్ 21 ప్రకారం 19వేల రూపాయల వేతనం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనాలో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన హాస్పిటల్ కార్మికులకు ప్రభుత్వం ఎలాంటి వసతులు కల్పించడం లేదని ఆరోపించారు. కార్మికులకు కూడా ప్రభుత్వ 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు.
ఈ సమావేశానికి మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ మిర్యాలగూడ అధ్యక్షులు శ్రీనివాస్ అధ్యక్షత వహించగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ నియోజవర్గ కార్యదర్శి ఎండి సయీద్, గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి డి లింగా నాయక్, మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యక్షులు ఎండీ వహీద్, వల్లందాస్ సైదులు,, కే సైదులు, శాంతమ్మ, పర్వీన్, ఝాన్సి, రేణుక, సుబాని, కుద్దుస్, సుబాన్ బి, పూలమ్మ,తదితరులు పాల్గొన్నారు.