Janam Sakshi - Telugu Daily News Portal > జిల్లా వార్తలు > suryapet > హుజూర్ నగర్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు / Posted on June 2, 2022
హుజూర్ నగర్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
హుజూర్ నగర్ జూన్ 2 (జనం సాక్షి): ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హుజూర్ నగర్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, మున్సిపల్ కార్యాలయంలో హుజూర్ నగర్ శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి జాతీయ జెండా ఎగురవేసి ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. గురువారం ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ
సుదీర్ఘ పోరాటాల, త్యాగాల, బలిదానాల ఫలితం ప్రస్తుత తెలంగాణ. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో రణ నినాదం అయిన నీళ్లు, నిధులు, నియామకాల అంతిమ లక్ష్యం గా సాగింది అన్నారు. ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకులు తెలంగాణ సాధనలో ముఖ్య భూమిక కెసిఆర్ అంకుంఠిత దీక్ష ,ఆమరణ నిరాహార దీక్ష ఫలితం తెలంగాణ వచ్చిందన్నారు. మరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఈనాగాశి నక్కాల పాలు గాకుండా తానే ప్రజాతీర్పుతో ముఖ్యమంత్రి గా రాష్ట్ర పగ్గాలు చేపట్టి నేడు అద్భుత, బంగారు తెలంగాణ గా ప్రపంచ దృష్టి ని అకర్షించేలా తెలంగాణ పాలన కొనసాగుతుంది అన్నారు. నీళ్లు మండే వేసవిలో కూడా ఊర్లలో చెరువులు అలుగులు పారుతున్నవి, రైతులు అయ్యా నీళ్లు ఎక్కువైనవి పొలాలు జాలు బరుతున్నాయి, నీళ్లు ఆపండి అని అడుగుతున్నారు. అలాగే కరెంట్ వ్యవసాయానికి ఉచిత కరెంట్ ను అందిస్తూ వ్యవసాయాన్ని లాభల దిశగా నడిపిస్తున్నారు అన్నారు. పెట్టుబడి సాయం అందిస్తున్నారు. రైతుకు భీమా ఇస్తున్నారు. రైతులు తెలంగాణ వచ్చినక వ్యవసాయాన్ని ఉత్సాహం తో చేస్తూ బంగారు పంట పండిస్తుంటే, కేంద్రం కండ్లు మండి రకరకాల ఆంక్షలు విధిస్తుంది. రైతులకు కనీసం మార్కెట్ సౌకర్యాలు, పండిన పంట కొనుగోలు మద్దతు ధరలు కల్పించకుండా కేంద్రం రైతులను ఇబ్బందుల పాలు చేసి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుంది అన్నారు. కెసిఆర్ రైతు పక్ష పాతీగ ఎన్ని కష్టాలను అయిన భరిస్తూ రైతులను, వ్యవసాయాన్ని కాపాడుతున్నారన్నారు. ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలు అన్నారు. అలాంటి ఆధునిక దేవాలయం కాళేశ్వరం డ్యామ్ ని నిర్మించి ప్రపంచం అంతా ఔరా అనేలా తెలంగాణ ప్రతిష్టా ను పెంచారు. డిస్కవరీ ఛానెల్ వారే వొచ్చి దానిని చిత్రీకరించారు అన్నారు. నియమాకాలలో ఇప్పటికే లక్ష పై చిలుకు నియామకాలు ఇచ్చి, మరో 90వేల ఉద్యోగాల ను ప్రకటించి, సుమారు 45 వేల పై చిలుకు నోటిఫికేషన్స్ వేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కుతుంది అన్నారు. హుజూర్ నగర్ లో కూడా కేవలం 2 న్నార సంవత్సరాల్లో మునుపు ఎవ్వరు ఎన్నడూ చేయలేని 20 ఏళ్ల అభివృద్ధిని చేసిన ఘనత మనదే అని హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గములో ప్రతి గ్రామములో సి సీ రోడ్లు మొదలుకొని అంతర్గత రోడ్లు, మెయిన్ రోడ్లు నిర్మిస్తున్నారు అన్నారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక విదంగా ప్రభుత్వ ఫలాలు అందిస్తున్నాము అన్నారు. ఎన్ని కేసులు వేసిన ఓపిక తో ప్రజల కోసం ఒత్తిడిని భరిస్తూ రాత్రి, పగలు తేడా లేకుండా పని చేస్తున్నము అన్నారు. రాష్ట్రం లో ఒకేఒక ఈఎస్ఐ హాస్పిటల్ వొస్తే దానిని హుజూర్ నగర్ లోకి తెచ్చినం అన్నారు. ఆర్ డి ఓ ఆఫీస్ ని ఏర్పాటు చేశామన్నారు. స్థానిక పరిశ్రమలు, ఫ్యాక్టరీలలో 70 శాతం లోకల్ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తున్నాం అన్నారు. పోటీ పరీక్షలకు 2 సార్లు పెద్ద ఎత్తున ఉచిత పోటీ పరీక్షల శిక్షణ, భోజనం పెట్టి ఇప్పిస్తున్నాము అన్నారు. ఇప్పటి ప్రయివేటు రంగాలలో నియోజక వర్గ యువతి, యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగ మేళాలు ద్వారా ఉద్యోగాలు ఇప్పించ్చామన్నారు. మొన్ననే సాఫ్టువెర్ కోచింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించినము, సొంత డబ్బులతో వికంగులకు మోటర్ స్కాటి లు ఇప్పించినము, వికలాంగుల క్యాంపు నిర్వహించి ఉచిత ముడుచక్రాల బ్యాటరీ బండ్లు, ఉచిత ఆర్టిఫిసియల్ కాళ్లు చేతులు అవయవాలు ఇప్పించినము, సుమారు ప్రతి 6 నెలలలో 2నుండి 3 కోట్ల రూపాయల సీఎంఆర్ చెక్కులు ఇస్తున్నాము, తన పర భేదం లేకుండా కల్యాణ లక్ష్మీ ని ఇప్పిస్తున్నాము, ఇంకా పెద్ద ఎత్తున హుజూర్ నగర్ నియోజకవర్గంలో రాష్ట్రం లో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ని ఒప్పించి పెద్ద ఎత్తున నిధులు తెప్పించి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్, పార్క్స్, ఓపెన్ స్టేడియమ్స్ నిర్మిస్తున్నము, చిత్త శుద్ధి తో ట్యాంక్ బండ్ ని నిర్మిస్తున్నము, ఇంకా ఎనో అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతూ 2 ఏళ్ళు కరోన కాలం అభివృద్ధిని ఆపేసిన, రాత్రి ,పగలు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా టైం తో పోటీ పడి పని చేస్తూ, పని చేపిస్తున్నాము అన్నారు. కేవలం ప్రజల కోసం, ప్రజలకు ఇచ్చిన మాట కోసం అనుకున్న సమయానికి అన్ని పనులు నాణ్యతగా ప్రజలకు అందించే మహా యజ్ఞం చేస్తున్నాము అన్నారు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు రాజకీయలు చేస్తూ కేసులు వేస్తూ ఎన్నిఆటంకాలు, బెదిరింపులు, అసత్య ప్రచారాలు కల్పిస్తుంటే కేవలం ప్రజల కోసం ఓపిక పడుతూ, ప్రజల కోసం బాధ ను భరిస్తూ మొండిగా పని జేస్తున్నాము అని హుజూర్ నగర్ శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి తెలియజేసారు. అంతేకాకుండా అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కు ధన్యవాదాలు తెలియజేసారు. అనంతరం స్థానిక ఆర్ డి ఓ ఆఫీసులో జాతీయజెండాను ఎగురవేసి, అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి సమర్పించి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అమర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట రెడ్డి, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, సోమగాని ప్రదీప్, రాంబాబు, పద్మ, కవిత, దీప్తి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.