*హెచ్ఐవిపై కళాజాత బృంద ప్రదర్శన*

మునగాల, నవంబర్ 2(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని బరాఖత్ గూడం గ్రామంలో హెచ్ఐవి, ఐడియాస్ పై కళాజాత ప్రదర్శన పరమేశ్ బృందం, చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ స్కీం మట్టి సుజాత, డి నాగలక్ష్మి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మట్టి సుజాత మాట్లాడుతూ, గ్రామాలలో ఆరోగ్య సమస్యలో హైరిస్క్ లో ఉన్నవారిని గుర్తించి వారికి పరీక్షలు చేయించి హెచ్ఐవి బారిన పడ్డవారికి దానిపై అవగాహన కల్పించి, దాని బారిన పడకుండా యువత పెడత్రోవ పట్టకుండా, మహిళా గ్రూపులకు సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించడం జరిగింది. టీబీ వైరస్ వ్యాప్తి చెందే పరిస్థితిలను వివరించి దానిపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంపై త్వరగా అర్థమయ్యే రీతిలో కళాకారుల ద్వారా చైతన్యం తెచ్చే పాటలతో కార్యక్రమం నిర్వహించారు. కిశోర బాలికలకు సుఖ వ్యాధులపై అవగాహన కల్పించి ఆరోగ్యపరమైన అలవాట్ల గురించి వివరించటం జరిగినది