హెచ్ఐవి ఎయిడ్స్ , మలేరియా, డెంగ్యూ, మరియు ఆరోగ్య పరిశుభ్రత పై అవగాహన….

గద్వాల రూరల్ జూన్ 22 (జనంసాక్షి):- గద్వాల మండల పరిధిలోని తుర్కోనిపల్లి గ్రామంలో  లైఫ్ చేంజ్ ఫౌండేషన్ అధ్వర్యంలో హెచ్ఐవి,ఎయిడ్స్, వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు..ఫౌండర్ పరుశరాముడు మాట్లాడుతూ మన ఆరోగ్యం మన బాధ్యత అని గ్రామస్థులకు ఆరోగ్య పరిశుభ్రత పర్యావరం పై అవగాహనా కల్పించారు.బాలకార్మికులు, బాల్య వివాహలను నిర్ములించాలి. బడి బయట ఉన్న పిల్లల్ని బడిలో చేర్పించాలి.నిసహాయ స్థితిలో ఉన్న పిల్లలు, మహిళలు, వృద్దులు, వికలాంగుల సంరక్షణ నిమిత్తము లైఫ్ చేంజ్ ఫౌండేషన్ పని చేస్తుంది అని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ లక్ష్మి గారు మాట్లాడుతూ
గ్రామస్థులకు, ఆరోగ్య పరిశుభ్రతపై అవగాహన కల్పించి లైఫ్ చేంజ్ ఫౌండేషన్ వారి కార్యక్రమాలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో లైఫ్ చేంజ్ ఫౌండేషన్ ఫౌండర్ పరుశరాముడు, హెల్త్ సూపర్వైజర్ లక్ష్మి,ఎఎన్ఎం కళావతి, ఆశ వర్కర్ కల్పన, లక్ష్మి, మహిళలు, పురుషులు తదితరులు పాల్గొన్నారు.