హెచ్‌టీసీ వన్‌ ఎస్‌9 విడుదల


దిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తుల సంస్థ హెచ్‌టీసీ మరో మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. హెచ్‌టీసీ వన్‌ సిరీస్‌లో వన్‌ ఎస్‌9 పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్‌ ధరను 499 యూరోలు (సుమారు రూ.33,700)గా ప్రకటించింది. హెచ్‌టీసీ జర్మనీ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌ను కంపెనీ ఫోన్ల జాబితాలో ఉంచారు. ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో వివరాలు వెల్లడించలేదు. గత ఏడాది విడుదల చేసిన వన్‌ ఎం9 మాదిరిగానే వన్‌ ఎస్‌9 కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

హెచ్‌టీసీ వన్‌ ఎస్‌9 ఫీచర్లు..
* 5 అంగుళాల తెర
* 2 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌
* 13ఎంపీ వెనుక కెమెరా
* 4ఎంపీ ముందు కెమెరా
* 2జీబీ ర్యామ్‌
* 16జీబీ స్టోరేజీ
* ఆండ్రాయిడ్‌ 6.0
* 2840 ఎంఏహెచ్‌ బ్యాటరీ