హెచ్.ఆర్.సి ఉమ్మడి వరంగల్ కన్వీనర్ గా సామాజికవేత్త చిలువేరు శంకర్ నియామకం.
ఉత్తర్వులు జారీ చేసిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర కమిటీ చైర్మన్ రాజారపు ప్రతాప్.
హనుమకొండ జిల్లా, ప్రతినిధి, జనంసాక్షి ఆగష్టు13:-
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర చైర్మన్ రాజారపు ప్రతాప్ హనుమకొండ జిల్లాలోని కాజిపేటలో గల తన స్వగృహంలో ప్రముఖ సామజికవేత్త చిలువేరు శంకర్ కు హెచ్.ఆర్.సి ఉమ్మడి వరంగల్ కన్వీనర్ గా నియామక పత్రం అందజేసి, శాలువా కప్పి హెచ్.ఆర్.సి లోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా చిలువేరు శంకర్ మాట్లాడుతూ తన సేవ దృక్పధాన్ని గుర్తించి,హెచ్.ఆర్.సి ఉమ్మడి వరంగల్ కన్వీనర్ గా భాద్యతలు అప్పగించినందుకు రాజరపు ప్రతాప్ కు శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. హెచ్.ఆర్.సి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు తన బాధ్యతలను నిర్వర్తిస్తానని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల అధ్యక్ష కార్యవర్గాన్ని సమన్వయము చేసుకుంటూ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆదేశాలు అమలయ్యేలా శ్రమిస్తానని తెలిపారు. అనంతరం రాజారపు ప్రతాప్ జిల్లా అధ్యక్షుడు తాళ్ళపల్లి తిరుపతి ని శాలువా కప్పి సన్మానించారు.ఈ సందర్బంగా హెచ్.ఆర్.సి హనుమకొండ జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి తిరుపతి చిలువేరు శంకర్ కు పుష్పగుచ్చం ఇచ్చి, హనుమకొండ జిల్లా కమిటీ తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలేరు మండల అధ్యక్షులు కీర్తి సురేష్, ధర్మాసాగర్ మండల అధ్యక్షులు గోనెల శ్రీనివాస్, ఫర్ ది పీపుల్ సేవా సంస్థ అధ్యక్షుడు వెల్ది అనిల్, హెచ్.ఆర్.సి హన్మకొండ మండల నాయకులు రాజారపు రాజు, వేలేరు నాయకులు బుట్టి సురేష్ యాదవ్, వాలంటీర్లు కొయ్యడ మహేష్, రాజేష్, అబ్దుల్ నబీ, రవివర్మ, ప్రశాంత్, శీను, చరణ్ తదితరులు పాల్గొన్నారు.