హెలికాప్టర్ల స్కాంపై స్పందించిన రక్షణ మంత్రి

న్యూఢిల్లీ : హెలికాప్టర్ల కుంభకోణంపై రక్షణ మంత్రి ఏకే ఆంటోని స్పందించారు. హెలికాప్టర్ల విక్రయ కాంట్రాక్టు కోసం లంచాల ఆరోపణలపై దర్యాప్తు చేయాలని సీబీఐకి ఆదేశించామని ఆయన తెలియజేశారు. సీబీఐ దర్యాప్తు పూర్తయిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి దోషులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఆరోపణలున్న ఆరు కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టామని తెలిపారు. మాజీ ఎయిర్‌చీఫ్‌ త్యాగిపై ఆరోపణలకు సంబంధించి సమాచారం లేదని చెప్పారు. రూ. 3,600 కోట్లకు 12 హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో భారత్‌ లంచం ఇచ్చిందని ఇటలీ పత్రికలు ఆరోపించిన విషయం తెలిసిందే.