హెల్తీ ఫై హాస్పిటల్ లో అరుదైన ఆపరేషన్

కడుపులోని 27 సెంమీ ల అండాశయ తిత్తి తొలగింపు

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):
కార్పొరేట్ స్థాయిలో విజయవంతంగా అరుదైన ఆపరేషన్లు చేసి ప్రజల మన్ననలు పొందుతున్న స్థానిక జమ్మిగడ్డలోని హెల్తీ పై హాస్పిటల్ డాక్టర్లు గురువారం మరో మహిళ కడుపులో నుంచి
27 సెంమీ ల అండాశయ తిత్తిని విజయవంతంగా తొలగించారు.గతంలో బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్లతో పాటు ఎన్నో విజయవంతమైన ఆపరేషన్లు చేశారు.పట్టాణానికి చెందిన మేడబోయిన సైదమ్మ గత మూడేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతూ పలు హాస్పటళ్లలో చికిత్స పొందారు.హెల్తీ ఫై హాస్పిటల్ వారిని సంప్రదించగా ఆమెకు అధునాతనమైన లాప్రోస్కోపింగ్ విధానం ద్వారా రెండు గంటల్లో ఆపరేషన్ ను విజయవంతంగా చేసి, కడుపులోని అండాశయ తిత్తిని తొలగించి ప్రాణాలు కాపాడారు.ఈ సందర్భంగా ఆమె కుమారుడు సోమరాజు మాట్లాడుతూ గత మూడేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్న తన తల్లికి హైదరాబాదులో ఆపరేషన్ చేయించాల్సిందిగా పలువురు డాక్టర్లు సలహా కూడా ఇచ్చారని అన్నారు.ఖర్చుతో కూడుకున్న ఆపరేషన్ ను అధునాతన పద్ధతిలో తక్కువ ఖర్చుతో చేసి తన తల్లి ప్రాణాలు కాపాడిన హెల్తిపై హాస్పిటల్ డాక్టర్లకు , యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.