హెల్త్‌ హబ్‌గా మన హైదరాబాద్‌

5
-సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 21 (జనంసాక్షి):

హైదరాబాద్‌ను హెల్త్‌హబ్‌గా మార్చాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఆరోగ్యశాఖపై సీఎం సవిూక్ష నిర్వహించిన సందర్భంగా  మాట్లాడుతూ స్టంట్స్‌ సహా ఇతర వైద్య పరికరాలు రాష్ట్రంలోనే తయారుచేసుకోవాలని సూచించారు. ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అలాగే ఆరోగ్య సలహా బోర్డు ఏర్పాటు యోచన ఉన్నట్టు తెలిపారు. కార్పొరేట్‌ వైద్య సంస్థలు, హెల్త్‌క్యాంపస్‌ల అభివృద్ధికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని సీఎం హావిూ ఇచ్చారు. వాటర్‌గ్రిడ్‌ పథకాన్ని కేంద్రం అభినందించిందని, కేంద్రం కోరిక మేరకు వాటర్‌గ్రిడ్‌ వివరాలు ఇతర రాష్టాల్రకు పంపినట్టు సీఎం కేసీఆర్‌ తెలిపారు. పేద రోగులపై అధికభారం పడకుండా వైద్య సేవలు అందించాలని ఈ రోజు తనను కలిసిన  వైద్య బృందాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కోరారు. డాక్టర్‌ సోమరాజు, డాక్టర్‌ కృష్ణారెడ్డి తదితర ప్రముఖ వైద్యుల బృందం సీఎం కేసీఆర్‌ను  కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ  హైదరాబాద్ను హెల్త్‌ హబ్‌గా మార్చాలని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు సంయుక్తంగా మెరుగైన వైద్యం అందించాలని కోరారు. స్టెంట్‌ సహా ముఖ్యమైన వైద్య పరికరాలు తెలంగాణలోనే తయారు చేసుకునేలా ఎదగాలని అన్నారు. నిష్టాతులైన వైద్యులతో ఆరోగ్య సలహా మండలిని ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ చెప్పారు.