హెల్మెట్-పెట్రోల్ కండిషన్‌లో న్యూ టర్న్

ముంబై: హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ అని పెట్టిన రూల్ నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం యూ టర్న్
తీసుకుంది. ఈ ఆదేశాలను ఉపసంహరించుకుంది. హెల్మెట్ లేకపోతే పెట్రోల్ పోయవద్దని ఫడ్నవీస్ సర్కారు ఆదేశించడంతో తమ వ్యాపారాలు పడిపోయాయని పెట్రోల్ బంకుల వ్యాపారులు లబోదిబోమన్నారు. దీంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. అయితే మరో కండిషన్ పెట్టింది. హెల్మెట్ లేకుండా పెట్రోల్‌ కావాలని వచ్చేవారి వివరాలను ఆర్టీవో కార్యాలయాలకు అందజేయాలని మెలిక పెట్టింది. పెట్రోల్ పోయడానికే ఉద్యోగులు లేని పరిస్థితుల్లో హెల్మెట్ లేకుండా వచ్చేవారి వెహికల్ నెంబర్, ఇతర వివరాలు సేకరించడం కష్టమని పెట్రోల్ బంక్ యజమానులు చెబుతున్నారు.