హైకోర్టులో జగన్‌కు చుక్కెదురు

హైదరాబాద్‌: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు. కడప పార్లమెంట్‌ సభ్యుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డికి నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో మంగళవారం  మరోసారి చుక్కెదురయింది. ఆరు రోజుల క్రితం స్టాట్యూటరీ బెయిల్‌ పిటిషన్‌ను కూడా కొట్టి వేసింది. విచారణ సాగుతోందని, కేసు కీలక దశలో ఉందని, ఇలాంటి సమయంలో బెయిల్‌ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశాలున్నాయన్న సిబిఐ వాదనతో ఏకీభవించిన కోర్టు జగన్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. దీనిపై జగన్‌ హైకోర్టుకు వెళ్లే అవకాశముంది.

కాగా ఆరు రోజుల క్రిత స్టాట్యూటరీ బెయిల్‌ పిటిషన్‌ సిబిఐ కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. జగన్‌ ఇరవై క్రితం స్టాబ్యూటరీ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై విచారించిన కోర్టు సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందన్న  అరెస్టు అక్రమంకాదన్న సిబిఐ వాదనతో ఏకీభవించి ఆయన బెయిల్‌ను తిరస్కరించింది. జగన్‌ కేసులో తాము సుప్రీం ఆదేశాలను పాటించామని తెలిపింది. రెగ్యూలర్‌ బెయిల్‌ పిటిషన్‌ పైన తీర్పును 30కి వాయిదా వేసింది.

సిబిఐ దీనిపై కౌంటర్‌ దాఖలు చేసింది. అనంతరం ఇరువైపుల వాదనలు విన్నది. ఆ తర్వాత తీర్పును ఈ రోజుకు వాయిదా వేసింది. మరోవైపు స్టాట్యూటరీ బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడంతో జగన్‌ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు గడప తొక్కిన విషయం తెలిసిందే. దీనిపై సిబిఐ రెండు రోజుల క్రితం కౌంటర్‌ దాఖలు చేసింది అనంతరం కోర్టు జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ తీర్పును ఈ నెల 11వ తేదికి వాయిదా వేసింది.