హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట
గచ్చిబౌలి పిఎస్ కేసు కొట్టివేత
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట దక్కింది. రేవంత్ రెడ్డిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఓ కేసును హైకోర్టు కొట్టేసింది. కాగా, సొసైటి స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారని 2016లో రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పెద్దిరాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. పెద్దిరాజు ఫిర్యాదు మేరకు రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని రేవంత్ రెడ్డి 2020లో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు జూన్ 20న తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా గురువారంఈ కేసు తీర్పు వెల్లడిరచింది హైకోర్టు. ఫిర్యాదుదారుడు చేసిన ఆరోపణల్లో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో రేవంత్ రెడ్డిపై గచ్చిబౌలి పీఎస్‌లో నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది.