హైకోర్టు ఉత్తర్వులపై క్రీడావర్గాల హర్షం
హైదరాబాద్: రాష్ట్ర ఒలింపిక్ సంఘం గుర్తింపు లేకుండా క్రీడా సంఘాలకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వరాదని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై క్రీడా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఒలింపిక్ సంఘంతో సంబంధం లేకుండా శావ్ గుర్తింపుతో కొనసాగుతున్న సంఘాలకు ఈ తీర్పు చెంపపెట్టని ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటి వరకూ తమ జాతీయ సమాఖ్య గుర్తింపు ఉందన్న సాకుతో ప్రభుత్వం వీటిని గుర్తించడాన్ని కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. తాజా తీర్పు భవిష్యత్తులో అక్రమాలు అరికట్టేందుకు ఉపయోగపడుతుందని ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు అందరూ అమలు చేయాలని ఆ వర్గాలు కోరుతున్నాయి.