హైడ్రోజన్‌ బాంబు తయారు చేశాం

4

– దేశసార్వభౌమత్వాన్ని గౌరవాన్ని పెంచుతుంది

– ఉత్తర కొరియా నేత కిన్‌జాంగ్‌

ఉత్తర కొరియా, డిసెంబర్‌ 10(జనంసాక్షి): తన వద్ద హైడ్రోజన్‌ బాంబు (థర్మో న్యూక్లియర్‌ బాంబు) ఉందని ఉత్తర కొరియా స్పష్టం చేసింది. అది అధికారికంగా రుజువైతే హైడ్రోజన్‌ బాంబు కలిగి ఉన్న దేశంగా ఇప్పటినుంచి ఉత్తర కొరియాను కూడా పరిగణించాల్సి ఉంటుంది. వాస్తవానికి హైడ్రోజన్‌ బాంబును తయారు చేసే దిశగా ఉత్తర కొరియా ముందడుగు వేస్తున్నట్లు ప్రపంచానికి ఇటీవలే తెలిసింది. అయితే, స్వయంగా ఆ బాంబును తయారుచేసుకునే పరిజ్ఞానం ఉత్తర కొరియాకు ఉందా లేదా అనే విషయం మాత్రం స్పష్టంగా తెలియదు. ఒక్క హైడ్రోజన్‌ బాంబు అటామిక్‌ బాంబులకంటే వందరెట్లు శక్తిమంతమైనది. ఉత్తర కొరియా నేత కిమ్‌ జాంగ్‌ అన్‌ తమ దేశంలోని విపణి తయారీ పరిశ్రమలను సందర్శించిన అనంతరం తమ వద్ద ఉన్న ఆయుధాల గురించి వివరించారు. ‘మా వద్ద పరీక్షించేందుకు అటామిక్‌ బాంబులు, హైడ్రోజన్‌ బాంబులు సిద్ధంగా ఉన్నాయి. అవి మా దేశ సార్వభౌమత్వాన్ని, దేశ గౌరవాన్ని ఇనుమడింపజేస్తాయని భావిస్తున్నాం’ అని ఆయన చెప్పారు.