హైదరాబాద్‌లో ఘోరం
– 300 మందికి ఏయిడ్స్ అంటించిన దుర్మార్గుడు
హైదరాబాద్,అక్టోబర్20(జనంసాక్షి): తనకున్న ప్రాణాంతక వ్యాధిని వందల మంది మహిళలకు అంటగట్టిన ఓ దుర్మార్గం హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. కేరళకు చెందిన 31 ఏళ్ల జేమ్స్… కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చాడు. మల్కాజ్‌గిరిలో నివాసముంటూ ఆటో నడిపేవాడు. ఈ నేపథ్యంలో చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. విచ్చలవిడితనం వల్ల ఎయిడ్స్ బారిన పడ్డాడు. ఆ విషయం జేమ్స్‌కు ఏడాది క్రితం తెలిసింది. అప్పటి నుంచి తనకున్న వ్యాధిని వందల మందికి విస్తరించాలనుకున్నాడు. లైంగిక సంబంధాల ద్వారా మహిళలకు వ్యాధిని విస్తరించడం మొదలుపెట్టాడు. ఏడాదిలో ఓక్కరు, ఇద్దరు కాదు ఏకంగా 300 మంది మహిళలను జేమ్స్ మాయమాటలతో నమ్మించి లోబరుచుకున్నట్లు విచారణలో వెల్లడించడంతో పోలీసులే కంగుతిన్నారు. రైల్వేస్టేషన్‌లో ఉన్న మహిళలతో పాటు సంపన్న కుటుంబాలకు చెందిన మహిళలు ఈ సైకో బారిన పడినట్లు వెల్లడైంది. దొంగతనం కేసులో జేమ్స్‌ను విచారిస్తుండగా ఈ దుర్మార్గం బయటపడింది. రామాంతపూర్‌లో మిత్రుడి ఇంట్లో జేమ్స్ దొంగతనం చేశాడు. మిత్రుడి భార్యకు అనుమానం వచ్చి జేమ్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడి బాగోతం బయటపడింది.