హైదరాబాద్ లో దారుణం

e0swelwoఆర్ధిక ఇబ్బందులతో పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలోని సీతారంబాగ్‌లో విషాదం చోటుచేసుకుంది. రెండేళ్లు కూడా నిండని ఇద్దరు కవలలతో సహా తల్లిదండ్రులు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సీతారాంబాగ్ కాలనీలో సోమవారం వెలుగుచూసింది.

స్థానికంగా స్క్రాప్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రాధిక(30), రాజు(34)లు తమ రెండేళ్ల కవలపిల్లలతో కలిసి ఉరి వసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘట నా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్య చేసుకొని ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.