హైదరాబాద్​ లో వాట్ఈస్​మైగోల్ అండర్18 వరల్డ్ క్లాన్స్​ను ప్రారంభించిన శోబు యార్లగడ్డ, శాంతా తౌటమ్

కంటోన్మెంట్ జనం సాక్షి జూలై 24 హైదరాబాద్ లో విద్యార్థులు వారు కోరుకున్న వృత్తిలో స్థిరపడడానికి ఊహించిన భవిష్యత్తులో జీవించేలా సాధికారిత కల్పించేందుకు ప్రముఖ స్టార్టప్ కంపెనీ వాట్ఈస్​మైగోల్ జె ఎన్ టి యు హెచ్ లో కార్యక్రమాన్ని నిర్వహించింది.వీటితో పటు విద్యార్థులకు రాజకీయాలు, పౌర సమాజంపై అవగాహనను పెంపొందిస్తోంది. వివిధ అంశాల్లో యువతకు లోతైన అవగాహన కల్పించేందుకు జేఎన్టీయూహెచ్ ఆడిటోరియంలో అండర్-18 వరల్ద్ సమావేశం నిర్వహించింది. విధాన నిర్ణయాల రూపకల్పన, ప్రజాస్వామ్య పనితీరు గురించి వారికి ప్రత్యక్ష అనుభవాన్ని కలిగించేలా ఎన్నికల అధికారులతో పాటు గ్రీన్ పార్టీ,ఫ్యూచర్ పార్టీ, పీపుల్స్ పార్టీల నుంచి ఎమ్మెల్యే నామినీలను ఒక్క చోటుకు తెచ్చింది.
ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత శోబు యార్లగడ్డ, తెలంగాణ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంతా తౌటమ్ వంటి ప్రముఖులు పాల్గొని విద్యార్థులతో సంబాషించారు.ప్రజాస్వామ్యం, ఓటింగ్, ఎన్నికల ప్రక్రియ వంటి అంశాలను లోతుగాతెలుసుకునేందుకు విద్యార్థులకు ఈకార్యక్రమం గొప్ప అవకాశంగా నిలిచింది. ఈకార్యక్రమంలో దాదాపు నిజమైన ఎన్నికలకుమార్గదర్శకులుగా ఈ యువ విద్యార్థులు ఓటర్లు, ఎమ్మెల్యే నామినీలు, ఎన్నికల అధికారుల పాత్రలను పోషించారు. ఔత్సాహిక గాయకులు, వైద్యులు, పౌర సేవకులు, భావి పౌరులకు ప్రాతినిధ్యం వహించే విధంగా అండర్-18 ప్రపంచానికి ప్రతినిధులను ఎన్నుకోవడానికి ఊహాజనిత ఎన్నికల ప్రక్రియలో కూడా పాల్గొన్నారు.
వాట్ఈస్​మైగోల్ వ్యస్థాపకురాలు చిత్రలీ శర్మ అండర్-18 ప్రపంచ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గాప్రతి నియోజకవర్గంలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు స్పష్టమైన సూచనలను అందిస్తూ ఎన్నికల అధికారులకు స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. ఫారం 2బి ద్వారా ఎమ్మెల్యే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియను ప్రారంభించి న్యాయమైన, పారదర్శక ఎన్నికల ప్రక్రియకు వేదికను ఏర్పాటుచేశారు.బాహుబలి చిత్రాల నిర్మాత శోబు యార్లగడ్డ,సినిమా నిర్మాణం, ప్రొడ్యూసింగ్, సంబంధిత అంశాలపై విలువైన అంతర్గత సమాచారాన్ని విద్యార్థులతో పంచుకున్నారు.సినిమా ప్రపంచంలోని యువ ప్రతిభను ప్రోత్సహించే వేదిక అయిన ‘మూవీ మేకర్స్ క్లాన్‌’ని కూడా ఆయనప్రారంభించారు.
తెలంగాణకు చెందిన చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత థౌతం ఆవిష్కరణల పట్ల తనకున్న అపారమైన జ్ఞానంతో విద్యార్థులను ప్రేరేపించారు. యువతలో ఆవిష్కరణ ఆలోచనలను పెంపొందించుకునే వాతావరణాన్ని అందించి, మెరుగైన భవిష్యత్తుకు దోహదం చేసే ‘ఇన్నోవేటర్స్ క్లాన్’ను ఆమె ప్రారంభించారు.వాట్ఈస్​మైగోల్ వ్యస్థాపకురాలు చిత్రలీ శర్మ సంతోషం వ్యక్తం చేస్తు యువత ప్రజాస్వామ్యంలో చురుకుగా ఉండాలని, వారి భవిష్యత్తును రూపొందించుకునే ప్రకియలో వారికి ఉన్న శక్తిని అర్థం చేసుకోవడానికి చేయూతనివ్వాలని మేంవిశ్వసిస్తున్నాము. ఈ అండర్-18 ప్రపంచ సమావేశం.. ఎన్నికలు,ప్రజాస్వామ్యంపై యువతకు అవగాహన, వారి ప్రాతినిధ్యం కల్పించేలా కొత్త శకానికి నాంది పలికాయి అని పేర్కొన్నారు.నిర్మాత శోబు యార్లగడ్డ కూడా తన ఆలోచనలను విద్యార్థులతో పంచుకున్నారు.సృజనాత్మకతను, సినిమా ప్రపంచాన్ని అన్వేషించడానికి విద్యార్థులను ప్రోత్సహించే ఈ విశిష్ట కార్యక్రమంలో నేను కూడా భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఔత్సాహిక చిత్ర నిర్మాతలు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు మూవీ మేకర్స్ క్లాన్ ఒక అద్భుతమైన వేదిక అవుతుంది అని ఆయన అభిప్రాయపడ్డారు.తెలంగాణ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంతా తౌటమ్ మాట్లాడుతూ, ‘ఆవిష్కరణ అనేది దేశ పురోగతికి చోదక శక్తి ఇన్నోవేటర్స్ క్లాన్ ద్వారా సమాజాన్ని సానుకూలంగా మార్చడంలో దారితీసే యువ ఆవిష్కర్తలను ప్రోత్సహించాలని మేం ఆశిస్తున్నాంఅన్ని ఈ ఈవెంట్‌ను శ్రీనిధి, లేహ్య,సాన్వి అద్భుతంగా హోస్ట్ చేశారు. ఈ ముగ్గురూ వాట్ఈస్​మైగోల్ లో బిజినెస్ రాక్‌స్టార్ ప్రోగ్రామ్‌లో పూర్వ విద్యార్థులు కావడం విశేషం అని అన్నారు.

తాజావార్తలు