హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: తల్లీకూతురు మృతి

యాదాద్రి భువనగిరి: విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు దుర్మరణం పాలయ్యారు. చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామం దగ్గర రాంగ్‌రూట్‌లో వచ్చిన ఆర్టీసీ బస్సు… కారును ఢీకొంది. దీంతో కారులో ఉన్న తల్లి పద్మజ, ఆమె కూతురు మృతిచెందారు. కాగా… వీరు గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన వారు. ఇదిలా ఉండగా పద్మజ లెక్చరర్ కాగా ఆమె కూతురు డాక్టర్ అని తెలిసింది.