హైవే టోల్గేట్ సర్వేను అడ్డుకున్న రైతులు

టోల్ గేట్లు మార్చాలని రైతుల విజ్ఞప్తి టేకులపల్లి, ఆగస్ట్ 22( జనం సాక్షి ): హైదరాబాదు గౌరెల్లి నుంచి కొత్తగూడెం వరకు జాతీయ రహదారి 930 నెంబర్ తో నాలుగు లైన్ల నిర్మాణం చేపడుతున్నారు. ఈ క్రమంలో టేకులపల్లి మండల పరిధిలో సులానగర్, సీతారాంపురం( రాజు తండా ) గ్రామాల మధ్యన టోల్గేట్ నిర్మాణానికి సర్వేజెండాలను ఏర్పాటు చేస్తుండడంతో రైతుల అడ్డుకున్నారు. స్థానిక తహసిల్దార్ కృష్ణవేణి అక్కడికి చేరుకొని రైతులను ఒప్పించడానికి ప్రయత్నం చేశారు. రైతులు ఆగ్రహంతో తమకు జీవనాధారమైన బోరు వ్యవసాయాలతో పంటలు పండిస్తూ జీవిస్తున్నామని, ఈ భూమి కోల్పోతే రోడ్డున పడతామని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, బేతంపూడి సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్ రావు, వైస్ ఎంపీపీ ఉండేటి ప్రసాద్ రైతుల పక్షాన నిలబడి టోల్గేట్ నిర్మాణం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాదని, పక్కనే ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ కానీ, దేవుని మాన్యం భూములు కానీ తీసుకొని అక్కడ టోల్గేట్ నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. బాధిత రైతులందరూ ప్రజా ప్రతినిధులైన స్థానిక శాసన సభ్యురాలు, పార్లమెంటు సభ్యురాలతో కలుసి సమస్యను విన్నవించుకుంటామని, అప్పటివరకు సర్వే ప్రక్రియను నిర్వహించవద్దని తెలిపారు. రోడ్డు విస్తరణలో ప్రజా ప్రయోజనాల కోసం తాము కట్టుబడి ఉంటామని, టోల్గేట్ నిర్మాణంతో రోడ్డున పడతామని, అందుకు ప్రత్యామ్నాయంగా ఇదే రోడ్డున ఇల్లందువైపు,కొత్తగూడెం వైపు 10 కిలోమీటర్లు లోపునే ఫారెస్ట్ భూములు ఉన్నాయని, టోల్గేట్ నిర్మాణం చేపట్టాలని, టోల్గేట్ నిర్మాణం కోసం సర్వే చేయాలనుకుంటున్న స్థలం నుండి మరొక కిలోమీటర్ దూరం నుండే దేవుని మాన్యం భూములు ఉన్నాయని అక్కడ నిర్మాణం చేపట్టవచ్చు కదా అని, రెండు గ్రామాల మధ్యన ఆనుక�