హోంమంత్రి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం: రాఘవులు
హైదరాబాద్: తెలంగాణ పై కేంద్ర హోంమంత్రి షిండే చేసిన వ్యాఖ్యలు బాధ్య తారాహిత్యంగా ఉన్నాయని సీపీఎం విమర్శించింది. హోంమంత్రి వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్లుగా ఉన్నాయని రాష్ట్ర విభజన విభజన విషయం తెల్చేందుకు ఇంకా జాప్యం ఎందుకని సీపీఎం రాష్ట్ర కార్యదర్శ రాఘవులు ప్రశ్నించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారారని విమర్శించారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో రాఘవులు పాల్గొన్నారు. వైకపా, తెదేపా కలిసి పనిచేసేది లేదని తేల్చిచెప్పారు. వామపక్ష పార్టీలతో కలసి ఉద్యమిస్తామన్న రాఘవులు సీపీఐతో ఉన్న అభిప్రాయ భేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు.