హోంమంత్రి సబితకు చుక్కెదురు

హైదరాబాద్‌, నవంబర్‌ 8 (జనంసాక్షి)
మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చుక్కెదురైంది. గురువారం జూబ్లీహాల్‌లో నిర్వహించిన మహిళా రౌండ్‌టేబుల్‌ ఆమెకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆమెపై మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. సబిత ¬ం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగాయని, అయినా ఏం చర్యలు చేపట్టారని నిలదీశాయి. దళిత, ఆదివాసీలు దారుణ పరిస్థితుల్లో ఉన్నారని, అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై జరుగుతున్న దురాగతాలను ఎందుకు నియంత్రించడం లేదని ప్రశ్నించారు. సబిత సొంత జిల్లా రంగారెడ్డిలో మహిళలపై ఆగడాలు పెరిగిపోయాయని దళిత స్త్రీ శక్తి సంఘం ప్రతినిధి మండిపడ్డారు. ¬ం మంత్రి సొంత నియోజకవర్గంలోనూ వేధింపు కేసులు, హత్యలు, అత్యాచారాలు పెరిగాయని, వాటిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలో రెండేళ్లుగా ఒక్క ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నిలబడడం లేదంటూ మండిపడ్డారు. దీనికి ¬ం మంత్రివర్గం వారే కారణమని విమర్శించారు. అవసరమైతే అన్ని ఆధారాలు బయటపెడతామని చెప్పారు. ‘విూరు ¬ం మంత్రి అయిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో ఒక్క ఎస్సీ, ఎస్టీ కేసులు నిలబడలేదు. ఎందుకు? రేపు కేసులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల కేసుల నమోదు దారుణంగా తగ్గిపోయింది. అందుకు కారణమేంటి?’ అని నిలదీశారు. అత్యాచారాలకు గురైన బాధిత మహిళలను మంత్రులు, ప్రజాప్రతినిధులు బాధితులను ఎందుకు
పరామర్శించలేదని సూటిగా ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలో అన్ని కేసులు రాజకీయ ప్రోద్బలంతోనే పరిష్కారమవుతున్నాయని సబిత దృష్టికి తీసుకువచ్చారు. ఒక్క కేసు కూడా పోలీసుస్టేషన్‌ వద్దకు వెళ్లడం లేదన్నారు. దీనికి కారణం ¬ం మంత్రి వర్గం వారేనని ఆరోపించారు. ¬ం మంత్రి చుట్టమని, బంధువు అని పేర్లు చెప్పుకొని కేసులను మాఫీ చేస్తున్నారని మండిపడ్డారు. మహిళల సంరక్షణకు, వేధింపుల బారి నుంచి బయటపడేసేందుకు స్వచ్ఛంద సంస్థలతో కొద్ది మంది అధికారులు మాత్రమే చిత్తశుద్ధితో పని చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు మాత్రం మహిళలను గాలికొదిలేశారని మండిపడ్డారు. నిండు సభలో తనపై తీవ్ర ఆరోపణలు రావడంతో ¬ం మంత్రి సబిత బిత్తరపోయారు. ఆ తర్వాత తేరుకొని, మహిళ ప్రతినిధి ప్రసంగిస్తుండగానే జోక్యం చేసుకున్నారు. తానెప్పుడు కేసుల్లో తలదూర్చలేదని ¬ం మంత్రి వివరణ ఇచ్చారు. తనపై ఆరోపణలు చేయడం సరికాదని, మహిళలపై జరిగే దాడుల కేసుల్లో తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. ఎప్పటికప్పుడు కేసులను సవిూక్షిస్తున్నానని, అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నానని తెలిపారు. విూరు చెప్పిన అంశాలపై తాను చర్యలు తీసుకుంటానని బదులిచ్చారు.