హోదా హుళక్కే

1

– కాంగ్రెస్‌ వాకౌట్‌

న్యూఢిల్లీ,జులై 29(జనంసాక్షి): ప్రత్యేక¬దాపై కేంద్రం స్పష్టమైన హావిూ ఇవ్వకుండానే డొంకతిరుగుడు సమాధానంతో సరిపెట్టింది. రాజ్యసభలో రెండోరోజు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక¬దాపై జరిగిన చర్చలో కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీ సమాధానం ఇచ్చారు. అయితే ఆయన సమాధానంలో ప్రత్యేక¬దా ఇవ్వడంపై  ఎలాంటి హావిూ లేదు.  అభివృద్ధి చెందే వరకు అండగా ఉంటామని మాత్రం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ హావిూ ఇచ్చారు. ఈ సమాధానంపై కాంగ్రెస్‌ తీవ్రంగా మండిపడింది. సర్కార్‌ తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేసింది. సీతారం ఏచూరి, రాజా తదితరులు కూడా ప్రత్యేక¬దాపై స్పపష్టత ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తంచేశారు. ఏపీకి ప్రత్యేక ¬దాపై రాజ్యసభలో జైట్లీ సమాధానం ఇస్తూ ఆంధ్రప్రదేశ్‌ కష్టాల్లో ఉందని అనేకమంది తన దృష్టికి తెచ్చారని, వెంకయ్య, సుజనా ఏపీ సెంటిమెంట్‌ను విన్పించారని తెలిపారు. ఇది సున్నితమైన, భావోద్వేగ విషయమన్నారు. ఏపీ, తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలని  ఆయన పేర్కొన్నారు. గతంలో బీజేపీ మూడు రాష్ట్రాలను

విభజించిందని…అప్పుడు ఎలాంటి సమస్యలు రాలేదని, అనేక సంప్రదింపులతో అప్పట్లో విభజన జరిగిందని గుర్తు చేశారు. జైరాం రమేష్‌ చేసిన తప్పుతో ఏపీలో కాంగ్రెస్‌ ఒక్కసీటూ గెలవలేకపోయిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక ¬దా విషయంలో కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్‌ జైట్లి ఇచ్చిన సమాదానం సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్‌ ప్రకటించింది. పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ మాట్లాడుతూ గత యుపిఎ ప్రభుత్వం ,కేంద్ర మంత్రివర్గం ఎపి ప్రత్యేక ¬దా పై తీర్మానం చేసిందని, దాని గురించి జైట్లి ప్రస్తావించలేదని ఆయన అన్నారు. రాష్ట్రానికి అదనపు సాయం ఎంత ఇస్తారో నిర్దిష్టంగా చెప్పాలని అన్నారు. ఎపికి ఇవ్వవలసిన ¬దాపై కేంద్రం దాటవేతకు నిరసనగా తాము వాకౌట్‌ చేస్తున్నామని సింగ్‌ ప్రకటించారు. సభ్యులు భావోద్వేగానికి గురికావొద్దని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ కోరారు. అధికారంలో ఉన్నవారే సభకు అడ్డు తగులుతున్నారని అన్నారు. ఏపీకి ప్రత్యేక ¬దాపై రెండో రోజు శుక్రవారం చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభకు సభ్యులు సహకరించాలని కోరారు. ప్రత్యేక ¬దాపై జరుగుతున్న చర్చలో 23మంది సభ్యులు పాల్గొన్నారని, దీనిపై కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ సమాధానం చెప్పారని కురియన్‌ అన్నారు. ఈ నేపథ్యంలో అరుణ్‌జైట్లీ ప్రసంగానికి టీడీపీ నేత సుజనాచౌదరి అడ్డుతగిలారు. దీంతో కురియన్‌ జోక్యం చేసుకుంటూ ఓ కేంద్రమంత్రి మాట్లాడుతుండగా మరో మంత్రి ప్రశ్నించడం అసాధారణమని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన గురించి జైట్లి ఏమి చెప్పలేదని టిడిపి ఎంపి సి.ఎంరమేష్‌ తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు పరిష్కారం చూపకుండా కేంద్రం ఎలా నిధులు ఇస్తుందని ఒడిషా ఎంపిలు అన్నారు. ఓడిషాకు రెవెన్యూలోటు విషయం ఎందుకు వదలివేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ఏపీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందన్న జైట్లీ  విభజనతో ఏపీ హైదరాబాద్‌ను, రెవెన్యూను కోల్పోయిందన్నారు. అయితే ఏపీ కోలుకునేందుకు సమయం పడుతుందని తెలిపారు. చంద్రబాబు పాలనా దక్షత, ప్రజల వ్యాపార దృక్పథంతో దీర్ఘకాలంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. కొన్నాళ్లపాటు ఏపీకి చేయూతనివ్వాల్సిన అవసరం ఉందన్న జైట్లీ ఏపీకి అన్ని విధాలా సాయం అందిస్తామన్నారు. కేంద్ర ఆదాయంలో రాష్ట్రాలకూ వాటా ఇస్తున్నామని, ఆదాయంలో 42శాతం రాష్ట్రాలకే ఇస్తున్నామని వివరించారు. అన్ని రాష్ట్రాలను సంతృప్తిపరచడం సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం కేంద్రం ఆర్థికలోటులో ఉందని, ప్రతి ఏటా లక్షల కోట్లు అప్పు తెస్తున్నామని అరుణ్‌జైట్లీ వెల్లడించారు. మిత్రపక్షం అధికారంలో ఉందని అధిక నిధులు కేటాయించలేమని, రాజ్యాంగానికి లోబడే నిధుల కేటాయింపులు ఉంటాయన్నారు. అయితే ఏపీ రాజధాని నిర్మాణానికి దశలవారీగా సాయం అందజేస్తామని అరుణ్‌ జైట్లీ అన్నారు. ఇప్పటికే రాజధాని నిర్మాణానికి రూ.2050 కోట్లు ఇచ్చామని చెప్పారు. ఏపీ రైల్వే జోన్‌ అనేది సున్నితమైన అంశమని…సురేష్‌ప్రభు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నారన్నారు. విశాఖ మెట్రో డీపీఆర్‌ కేంద్రం పరిశీలనలో ఉందని తెలిపారు. 13వ షెడ్యూల్‌లోని హావిూలన్నీ అమలు చేశామని చెప్పారు. కృషి సించాయి పథకం కింద ఏపీకి 8 ప్రాజెక్టులను ఆమోదించామని అరుణ్‌జైట్లీ తెలిపారు. కాగా రాజధాని నిర్మాణ నిధులపై సుజనా మాట్లాడుతూ ఏపీ రాజధానికి ఇచ్చిన రూ.2వేల కోట్లలో రూ.1000కోట్లు గుంటూరు, విజయవాడ నగరాల అభివృద్ధికి ఇచ్చినవే అని తెలిపారు. ఉమ్మడి ఎపి ప్రగతి శీల రాష్ట్రంగా ఉండేదని, విభజన తర్వాత కూడా భవిష్యత్తులో తెలంగాణ, ఎపిలు కూడా మంచి ప్రగతి సాదిస్తాయని ఆశిస్తున్నామని  అరుణ్‌ జైట్లి అన్నారు.దేశంలో ప్రాంతం,కులం,తదితర సున్నిత అంశాలకు సహజంగానే ప్రాధాన్యత ఉంటుందని ఆయన అన్నారు. గతంలో కూడా చాలా రాష్ట్రాలు  ఏర్పాడ్డాయని అన్నారు.చిన్న రాష్ట్రాలు  దేశానికి మంచిదని తమ పార్టీ భావిస్తుందని ఆయన అన్నారు. వాజ్‌ పేయి టైమ్‌ లో మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయని, అప్పుడు ఏకాభిప్రాయ సాధన ద్వారా జరిగిందని అన్నారు.అందువల్ల రాజకీయ సంక్షోభం రాలేదని అన్నారు.కేంద్ర మాజీ మంత్రి జైరామ్‌ రమేష్‌ విబజనపై పుస్తకం రాశారని, అలాగే బిల్లు కూడా తానే రచించానని చెప్పారని,వ్యూహకర్తలలో ఒకరిగా ఉన్నారని, అయినా కాంగ్రెస్‌ డిపాజిట్లు కోల్పోయిందని జైట్లి చమత్కరించారు.హైదరాబాద్‌ తెలంగాణకు వెళ్లడం వల్ల ఎపికి నష్టం జరిగిందని, అయినా దీర్ఘకాలంలో రికవర్‌ అవుతుందని అన్నారు. చంద్రబాబు సుపరిపాలన వల్ల ప్రజల ఔత్సాహికత వల్ల ఇది సాద్యమని అన్నారు. అయితే ప్రస్తుతం కొంత సాయం చేయవలసి ఉందని అన్నారు.కేంద్రం విభజన చట్టంలోని అన్నహావిూలను నెరవేర్చుతుందని అన్నారు.కేంద్ర ఆదాయ వనరులు, రాష్ట్ర ఆదాయ వనరుల గురించి కూడా తెలుసుకోవాలని అన్నారు.ఆదాయపన్ను, కస్టమ్స్‌,ఎక్సైజ్‌ వంటి వాటి ద్వారా కేంద్రానికి ఆదాయం వస్తుందని, దానిని రాష్ట్రాలకు కూడా పంచడం జరుగుతుందని జైట్లి చెప్పారు.