Janam Sakshi - Telugu Daily News Portal > జిల్లా వార్తలు > హైదరాబాద్ > Main > హోమియోపతి వైద్యఅభివృద్ధికి సహకరిస్తాం-లక్ష్మారెడ్డి / Posted on April 10, 2015
హోమియోపతి వైద్యఅభివృద్ధికి సహకరిస్తాం-లక్ష్మారెడ్డి
హైదరాబాద్: హోమియెపతి వైద్య అభివృద్ధికి ప్రభుత్వం తరపున అన్ని సహాయా సహకారాలను అందిస్తామని తెలంగాణ రాష్ట్ర వైద్యఆరోగ్యాశాఖ లక్ష్మారెడ్డి తెలిపారు. హోమియోపతి పితామహుడు హెమన్ జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. పాజిటీవ్ హోమియోపతి కేర్ ఆధ్వర్యంలో నెక్లస్‌రోడ్డులో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి ముఖ్య అథితిగా హాజరై, ప్రసంగించారు. ఈ రంగంలో సుదీర్ఘకాలంపాటు..సేవలు అందిస్తున్న పలువురు వైద్యులకు సన్మానం చేసి, అవార్డులు అందించారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో టిడిపి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు.