*హ్యూమన్ రైట్స్ జిల్లా చైర్మన్ గా నరగోని శంకర్ గౌడ్ నియామకం హర్షం*

 మునగాల గౌడ సంఘ నాయకులు

మునగాల, సెప్టెంబర్ 12(జనంసాక్షి): మునగాల మండల కేంద్రంలో గల శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఇంటర్నేషనల్  హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ గా హుజూర్నగర్ కు చెందిన నారగోని శంకర్ గౌడ్ ని నియమించడం చాలా సంతోషకరమని మునగాల గౌడ సంఘ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు గండు అంజయ్య గౌడ్ మరియు మామిడి శీను గౌడ్ మాట్లాడుతూ, సామాన్య కానిస్టేబుల్ గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన ఆయన ఆయన తనదైన శైలిలో ఉద్యోగ బాధ్యతలు  నిర్వహిస్తూ అవరోధాలను అధిగమిస్తూ అంచలంచెలుగా ఎదుగుతూ ఇంటిలిజెన్సీ సబ్ ఇన్స్పెక్టర్ గా పదవి విరమణ పొందిన ఆయన  తనకంటూ ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నారని, ఆయన దగ్గరికి సహాయం అర్ధించి వెళ్లిన ప్రతి ఒక్కరికి ఆయనకు చేతనైనంత సహాయాన్ని అందిస్తూ వారికి చేయూతనిస్తూ ముందుకు నడిపిస్తున్నారని, జిల్లాలోని ఎన్నో కంఠమహేశ్వర స్వామి దేవాలయాలకు స్వామివారి యొక్క విగ్రహాలు ఇప్పించారని, అదేవిధంగా మునగాల యొక్క దేవాలయాన్ని కూడా విగ్రహాలు ఇప్పించాలని వారు తెలిపారు. ఇలాగే వారు అంచలంచెలుగా ఎదుగుతూ పదిమందికి సహాయ సహకారాలు అందించి మంచి జీవనశైలి ఏర్పరచుకొని నిండు నూరేళ్లు సంతోషంగా జీవితం గడపాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు నారగాని వెంకయ్య గౌడ్, నారగాని వెంకన్న పెద్ద గౌడ్, కీర్తి రామస్వామి గౌడ్, కొండ రామాంజనేయులు గౌడ్,    కుక్కడప్పు లక్ష్మయ్యగౌడ్, మామిడి గురునాథం గౌడ్, ఎరగాని వెంకన్న గౌడ్ ,గుండు నాగేశ్వరరావు గౌడ్, అమరగాని శ్రీనివాస్ గౌడ్, నారగాని వెంకన్న గౌడ్, మండవ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.