ాల దిగుబడిని పెంచుకోవాలి :ఎమ్మెల్యే
ఖమ్మం,మార్చి3(జనంసాక్షి): వేసవిలో పశువులను జాగ్రత్తగా కాపాడుకొని పాల దిగుబడిని పెంచుకోవాలని ఎమ్యెల్యే తాటి వెంకటేశ్వర్లు సూచించారు. దమ్మపేట పశువైద్యశాలలో మంగళవారం పశుగ్రాస పెంపకంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్యెల్యే మాట్లాడుతూ రైతులకు పాడిపరిశ్రమ ద్వారా అధిక లాభాలు పొందవచ్చన్నారు. అనంతరం జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి అంజయ్య రైతులకు సలహాలు, సూచనలు అందించారు. వేసవిలో పశుగ్రాసానికి ఇబ్బంది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. సత్తుపల్లి ఏడీఏ కిషన్‌సింగ్, దమ్మపేట పశువైద్యాధికారి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.