01పి , చెరువును తలపిస్తున్న నష్కల్ రైల్వే అండర్ బ్రిడ్జి
చెరువును తలపిస్తున్న నష్కల్ రైల్వే అండర్ బ్రిడ్జి
స్టేషన్ ఘన్పూర్, జూన్ 10, ( జనం సాక్షి ), చిల్పూర్ మండలంలోని జాతీయరహదారి నుండి నష్కల్ గ్రామానికి వెళ్లేదారిలో ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జి కింద సైడ్ వాల్ నుండి నీరు లీకేజీ అయి రోడ్డుపై చెరువును తలపించే లా నీరు చేర డంతో వాహనదారులు, ప్రయాణికులు, ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. నష్కల్ గ్రామానికి వెళ్లడానికి ఉన్నతాధికారులు రైల్వే గేట్ సమస్య తీర్చడం కోసం అండర్ బ్రిడ్జి నిర్మించారు. ఈ క్రమంలో రైల్వే అండర్ బ్రిడ్జి సైడ్ వాల్ నుండి నీరు లీకేజీ అవుతుండడంతో రైల్వే అండర్ బ్రిడ్జి కింద నీరు నిలవడంతో వాహనదారులు, ప్రజలు నష్కల్ గ్రామానికి వెళ్లడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారు లు రైల్వేఅండర్ బ్రిడ్జికిందికి నీరురాకుండాచర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుత వేసవి కాలంలోనే ఇంత నీరు అండర్ బ్రిడ్జి కింద ఉంటే, వర్షాకాలం వస్తే గ్రామానికి వెళ్లడానికి మా పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు రైల్వే అండర్ బ్రిడ్జి సైడ్ వాళ్ళ నుండి నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజ లు కోరుతున్నారు.