ఐకాస ధర్నా ఆగస్టు 1కి వాయిదా
హైదరాబాద్: హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద గురువారం నిర్వహించాల్సిన ధర్నాను ఆగస్టు ఒకటికి వాయిదా వేసినట్లు టీఎన్జీవో నేత శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. జన చైతన్య యాత్రను ప్రస్తుతం వాయిదా వేసినట్లు చెప్పారు. ఆగస్టు ఒకటిన ధర్నా తర్వాత యాత్రపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.