10 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టుకున్న ఒకే ఒక నియోజక వర్గం బాన్సువాడ. కల్లూర్ లో బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన స్పీకర్

కోటగిరి సెప్టెంబర్ 24 జనం సాక్షి:-బాన్సువాడ నియోజక వర్గం కోటగిరి మండలంలోని కల్లూర్,లిం గాపూర్,భర్ధిపూర్ తాండ,ఘన్నరం గ్రామాలలో పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొని ఆయా గ్రామాల లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల చెక్కులు,
బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.మొదటగా కల్లూరు గ్రామ ప్రజలు స్పీకర్ కి ఘజమాలతో గ్రామంలోకి స్వాగతం పలికారు.ఈ స్పీకర్ గ్రామంలో జరిగిన,జరుగుతున్న,జరగపోయే పలు ప్రభుత్వ కార్యక్రమాలను గ్రామంలోనీ ప్రతి వాడవాడన తిరుగుతూ గంగపుత్ర,ముదిరాజ్,
కమ్మరి,మాల,మాదిగ,పద్మశాలి,యాదవ,సంఘాల వారితో మాట్లాడి వారి సంఘాలకు అవసరమైన నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రజావేదిక సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ. గ్రామానికి చెందిన మజీద్,స్మశాన వాటిక,
గ్రామంలోని బీటీ రోడ్లు,పోతంగల్ నుండి కల్లూర్ గ్రామానికి కలిపే లింకు రోడ్లకు అవసరమయ్యే నిధులను మంజూరు చేస్తానని సభాముఖంగా తెలిపారు.తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలో కోటి బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
అందులో భాగంగా కోటగిరి మండలానికి 19 వేల బతుకమ్మ చీరలు రాగ కల్లూర్ గ్రామానికి 792 మజురైన బతుకమ్మ చీరలను గ్రామ ఆడ పడుచులకు పంపిణీ చేశారు.తదనంతరం కల్లూరు గ్రామానికి చెందిన 19 మంది డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు సంభదిత చెక్కులను పంపిణీ చేశారు.తదనంతరం లింగాపూర్,భర్ధిపూర్ తాండ, ఘన్నారం గ్రామానికి చెందిన స్వంత స్థలంలో ఇండ్లు నిర్మించుకున్న 17 మంది డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లక్ష్మి,ఎంపీటీసీ సుజాత,లింగాపూర్ సర్పంచ్ హన్మంతు,జెడ్పీటీసీ శంకర్ పటేల్,అర్.డి.ఓ
రాజేశ్వర్,జిల్లా కో ఆప్షన్ సభ్యులు సిరాజ్,వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్,బాల రెడ్డి,నాగేశ్వర్,
కృష్ణ రెడ్డి,సీనియర్ నాయకులు,మండల సర్పంచులు,ఎంపీటీసీలు,మండల అధికారులు,
ఆయా గ్రామాల ప్రజలు,కార్యకర్తలు పాల్గొన్నారు.