10 శాతం గిరిజన రిజర్వేషన్ పెంపు జీవో విడుదల పట్ల హర్షం… స్వీట్ల పంపిణీ :

మిర్యాలగూడ, జనం సాక్షి :
తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ను 6నుండి 10 శాతాన్ని పెరుగుతూ జిఓ 33 విడుదల పట్ల ట్రైబల్ రిజర్వేషన్ పోరాట సమితి(టి ఆర్ పి ఎస్), బంజారా ఉద్యోగుల సంఘం శనివారం హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు రిజర్వేషన్ పెంపు జీవో విడుదల పట్ల నాయకులు రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిచిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు పరస్పరం స్వీట్లు పంపిణీ చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాలోతూ దశరధ నాయక్, ఎరుకల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు వజ్రగిరి అంజయ్య మాట్లాడుతూ మాట ప్రకారం రిజర్వేషన్ పెంచిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సత్యవతి రాథోడ్,  ఏ ఐ బి ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు, ట్రైకార్ చైర్మన్ గా ఎన్నికైనా ఇస్లావత్ రామచంద్ర నాయక్, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రిజర్వేషన్ సాధనకు కృషిచేసిన రాష్ట్ర జిల్లా స్థాయి నేతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఇటీవల విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్ లోనూ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అమలు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. రిజర్వేషన్ అమలు విషయంలో ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సంఘ నాయకులు ఉద్యోగులు అప్రమత్తంగా ఉండి రిజర్వేషన్ అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గోపీనాయక్, మక్లా నాయక్, రిజర్వేషన్ సాధన పోరాట సమితి నాయకులు సీతారాం నాయక్,నానినాయక్,రాంచందర్ నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు సైదా నాయక్,కృష్ణా నాయక్,లింగ నాయక్, మురళి యాదవ్, మోసిన్ అలీ, ఎర్రయ్య, సర్ణాల వెంకయ్య యాదవ్, కోటయ్య, వెంకటయ్య, అస్లాం, రవి,రాములు నాయక్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.