100% పన్నుల వసూలుకు కృషి చేయాలి
ఫోటో రైట్ అప్ :రుక్మాపూర్ గ్రామపంచాయతీలో రికార్డులు తనిఖీ చేస్తున్న జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య
చొప్పదండి, ఆగస్టు 22 (జనం సాక్షి): గ్రామపంచాయతీలలో 100% పన్నుల వసూలుకు అధికారులు కృషి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య సూచించారు. మొబైల్ అప్ ఇన్స్పెక్షన్ లో భాగంగా రుక్మపూర్ గ్రామ పంచాయతిని మంగళవారం ఆయన సందర్శించారు. గ్రామపంచాయతీ పరిధిలో రెగులర్ శానిటేషన్ చేయాలని,వేర్మి కంపోస్ట్ తయారు చేయాలని ఆదేశించారు . నర్సరీ కంపోస్ట్ షెడ్డు స్మశాన వాటికను పరిశీలించి మాట్లాడారు. రికార్డులు నమోదులో నిర్లక్ష్యంగా ఉండవద్దని, వానాకాలంలో ఎక్కడ కూడా నీటి నిలువలు ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఆయన వెంట రుక్మాపూర్ గ్రామ సర్పంచ్ చిలుక లింగయ్య, మండల పంచాయతీ అధికారి రాజగోపాల్ రెడ్డి, గ్రామ కార్యదర్శి ఎండి మెహతాబ్ ఉన్నారు.