100 యూనిట్లకు ఓ రేటు 101తర్వాత డబుల్ రేటు : రైతు సంక్షేమ సమితి. 30రోజులకు తీయాల్సిన బిల్లు మోసం చేయడానికి 32రోజుల తర్వాత బిల్లు తీస్తున్నారు

కోడేరు (జనంసాక్షి) అక్టోబర్ 16  కోడేరు మండల కేంద్రము లో రైతు సంక్షేమ సమితి నాయకులు పత్రికా ప్రకటన ద్వారా తెలిజేస్తూ విద్యుత్ శాఖ ఉద్యోగులు 30 రోజులకు బిల్ తీయాలి కానీ 30 రోజుల తరువాత 31 నుండి 40 రోజులవరకు బిల్లులు తీసి వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలంగాణ రైతు సంక్షేమ సమితి కొల్లాపూర్ డివిజన్ కన్వీనర్ సురేష్, నాయకులు సత్యంగౌడ్, షరీఫ్ లు ఆవేదన వ్యక్తం చేశారు.
100 యూనిట్స్ స్లాబ్ వరకు యూనిట్ కి 3.60 రూపాయలు. (ఒక్కొక్క యూనిట్ కాస్ట్.). 2 రోజులు  చేయడం వల్ల 2 రోజులలో 6 యూనిట్స్ తో కలిపి 106 యూనిట్స్ వస్తుందని అంటే అప్పుడు 101 యూనిట్స్ దాటితే ఒక్కో యూనిట్ ధర 6.90 రూపాయలు. ఇప్పుడు అనవసరంగా 6.90 రూపాయల లెక్క ప్రకారం అప్పుడు 101 × 6.90 = 690 కట్టవలసి వస్తుంది. 100 యూనిట్స్ కు 390/- తేడా 690-390=300 అదనం. ఇది ఏ ఒక్కరికో జరుగుతున్నది కాదు. వినియోగదారులను దోపిడీ చేయడంలో
AE, DE & SE స్థాయిలో వొస్తున్న అదేశాలకు అనుగునంగానే బిల్లింగ్ ఇలా ఆలస్యంగా తీసి అదనంగా డబ్బులు కట్టేలా సిబ్బంది చేస్తున్నారు. ఈ మోసం ప్రతి నెల జరుగుతుంది. ఐన మనం నోరు మూసుకొని బిల్లులు కడుతున్నాం. మరి ఈ మోసాన్ని ఆపడానికి ప్రజల్లో చైతన్యం తీసుకు రావడానికి మేధావులు, సామాజిక స్పృహ కలిగిన యువత, ప్రజాసంఘాలు ఈ విషయంపై అవగాహన కల్పించడం కోసం పోరాటానికి నడుం కట్టాలి..
విద్యుత్ శాఖ మోషంతో మధ్యతరగతి మరియు పేద ప్రజలు సగం కట్టాల్సిన బిల్లులపై రెండింతలు కట్టాల్సిన పరిస్థితి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చౌర్యానికి పాల్పడే దొంగలను వదిలేసి నిజాయితీగా ఉండే పేద, మధ్యతరగతి ప్రజానీకాన్ని దోచుకోవడం ఎంత వరకు సమంజసం అని రైతు సంక్షేమ సమితి నాయకులు  నిలదీశారు. నిత్యవర వస్తువులపై పెరిగిన ధరలతో ప్రజలు మోయలేని భారంతో సతమతమవుతున్న సమయంలో స్లాటుల పేరుతో 30 రోజులు ,101యూనిట్ల పేరుతో మోసం చేయడం వినియోగదారులు భరించలేకపోతున్నారు.వినియోగదారులను ఏదేని సంస్థలు, ఏజన్సీలు, ఇతర పద్దతుల్లో మోసం చేస్తే న్యాయం చేయమని ప్రభుత్వానికి చెప్పుకొంటాం అలాంటిది ప్రభుత్వ రంగ సంస్ధనే అక్రమ రాబడికి తెర లేపితే ఇంతకన్నా దారిద్ర్యం, దారుణం మరొకటుండదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను దోపిడీ చేయడం కోసం  విద్యుత్ శాఖ వ్యవహరిస్తున్న తీరుపై పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని హితువు పలికారు. ఎవరికి ఇలాంటి ఇబ్బంది రావద్దు అనుకున్నవారు సపోర్ట్ చెయ్యండి.
ఈ మోసాన్ని ఆపడానికి రైతులు ప్రజలు కలిసి రావాలని రైతు సంక్షేమ సమితి నాయకులు పత్రికా ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు.