100 శాతం సబ్సిడీ తో ఉచిత చేప పిల్లల పంపిణీ
వనపర్తి జిల్లా మత్స్యకారులకు భరోసానిస్తున్న ప్రభుత్వం, 100 శాతం సబ్సిడీతో ఉచిత చేప పిల్లల పంపిణీ, జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్. లోకనాథ్ రెడ్డి, మత్స్యకారులకు భరోసానిస్తూ, ప్రభుత్వం వారి ఆర్థిక అభివృద్ధికి ఉచిత సేవ పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్. లోకనాథ్ రెడ్డి సూచించారు. గురువారం వనపర్తి పట్టణంలోని నల్ల చెరువులో 100 శాతం సబ్సిడీపై ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం లో గ్రంథాలయం చైర్మన్ లక్ష్మయ్యతో కలిసి ఆయన ముఖ్య అతిధులుగా హాజరై చేప పిల్లలను చెరువులో వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వం పథకాలను సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ లక్ష్మయ్య,మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్,వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, జిల్లా మత్స్య శాఖ అధికారి, రెహమాన్, పుట్టా బాలరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి, మత్స్యకారుల సంఘం,కౌన్సిలర్ లక్ష్మీనారాయణ, మత్స్య సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య, అధికారులు,సిబ్బంది ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.