10,11 తేదీల్లో భాగ్యనగరంలో జాతీయ సదస్సు

హైదరాబాద్‌: నేటి సమాజంలో సాంఘిక అసమానతలు, కుళ్లిన రాజకీయాలను నిర్మూలించేందుకు యువతలో చైతన్యం తీసుకురావడానికి హైదరాబాద్‌లో జాతీయ సదస్సు నిర్వహించన్నుట్లు యూనివర్సల్‌ ప్రౌటిస్ట్‌ ఫెడరేషన్‌ తెలిపింది. ఈ నెల 10,11 తేదీల్లో నిర్వహించే ఈ సదస్సులో దేశ నలుమూలల నుంచి పలువురు మేధావులు. విద్యార్థులు పాల్గొంటారని వారు తెలిపారు ‘ ప్రగతి శీల ఉపయోగతత్వం ‘ అనే అంశం ఆధారంగా ఈ సంస్థను 1959లో ప్రారంభించామని తెలియజేశారు. విద్యార్థుల్లో నైతిక, ఆధ్యాత్మిక విలువలు నెలకొల్పి వారి అభివృద్థికి పాటుపడటం, ఉచిత విద్య, వసతి, భోజనం అందించడమే తమ సంస్థ లక్ష్యమని వారు  స్పష్టం చేశారు.