108లో మహిళ ప్రసవం..కవలల జననం
ఖమ్మం,మార్చి02(జనంసాక్షి): చింతకాని మండలంలోని సీతమ్మపేటకు చెందిన రమణ అనే గర్భిణి పురిటి నొప్పులు రావడంతో ఖమ్మంలోని ఆసుపత్రికి 108 వాహనంలో తీసుకెళ్తున్నారు. వాహనం పందెళ్లపల్లి సవిూపంలోకి రాగానేఆమె మార్గమధ్యంలో ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. తల్లి, పిల్లలు క్షేమంగా ఉండడంతో జాగ్రత్తలు తీసుకున్న 108 సిబ్బందిని గ్రామస్థులు, కుటుంబీకులు అభినందించారు.