11వ రోజుకు చేరిన హెల్‌త అసిస్టెంట్ల రిలే దీక్షలు
హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖలో తొలగించిన హెల్త్ అసిస్టేంట్లను విధుల్లోకి తీసుకోవాలని ఏపీ హెల్త్ అసిస్టేంట్ల కో-ఆర్డీనేషన్ కమిటీ డిమాండ్ చేసింది. ఇందుకు నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద చేపట్టిన రిలే నిరాహర దీక్ష 11వ రోజుకు చేరింది. ప్రభుత్వ చర్యల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 1700కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. చీఫ్ విప్ హోదాలో ఉన్న సమయంలో రెగ్యులర్ చేస్తామని హామి ఇచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డికి ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.