11వ, వార్డ్ కౌన్సిలర్ జక్కు పద్మ రవీందర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సిగ్మా ఆసుపత్రి సిబ్బంది
ధర్మపురి (జనం సాక్షి న్యూస్) జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణ కేంద్రంలో గల స్థానిక మునిసిపల్ కార్యాలయ పరిధిలో గల శ్రీ లక్ష్మీ నరసింహ రెసిడెన్సి అపార్ట్ మెంట్ పార్కింగ్ స్థలం నందు స్థానిక 11వ, వార్డ్ కౌన్సిలర్ జక్కు పద్మ రవీందర్, ఆధ్వర్యంలో.. జగిత్యాల సిగ్మా ఆసుపత్రి సిబ్బంది సహకరంతో.. శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.e వైద్య శిబిరాన్ని స్థానిక కౌన్సిలర్ జక్కు పద్మ రవీందర్ రిబ్బన్ కట్ చేయగా.. ఈసీజీ రూమ్ వద్ద డాక్టర్ నందగిరి ప్రణయ్ కుమార్, రిబ్బన్ కట్ చేసి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.e వైద్య శిబిరానికి సుమారు మూడు వందల మందికి పైగా పట్టణ ప్రజలు హాజరు అవ్వగా.. వారికి ఉచితంగా బీపీ,ఈసీజీ, షుగర్,రక్త పరీక్షలు నిర్వహించి, సుమారు లక్ష రూపాయలకు పైగా విలువైన మందులను వారికి పంపిణీ చేసిన, తధానంతరం ఉచితంగా సేవలు అందించిన సిగ్మా ఆసుపత్రి రెసిడెంట్ డాక్టర్ ప్రణయ్ కుమార్, డాక్టర్ మహ్మద్ అప్రోజ్, మేనేజర్ గణేష్,క్యాంపు ఇంచార్జి మహ్మద్ షవర్,మహ్మద్ నావిద్, మహ్మద్ జవాద్, పవన్,సుజాత, పీఆర్ఓ పృథ్వీ,సీనియర్ జర్నలిస్ట్ జైషేట్టి రాకేష్ లను, స్థానిక 11వ, వార్డ్ కౌన్సిలర్ జక్కు పద్మ రవీందర్, స్వీట్ బాక్స్ ఇచ్చి,కృతజ్ఞతలు తెలిపి,శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో వారితో పాటు జక్కు దేవేందర్, పప్పుల శ్రీనివాస్,రంగ హరినాథ్, పాలేపు గణేష్, సాధు శ్రీకాంత్ లతో పాటు,స్థానిక అధికారులు,పట్టణ ప్రజలు,సిగ్మా ఆసుపత్రి సిబ్బంది, స్థానిక యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.