11 మంది చిన్నారులకు విముక్తి
వరంగల్: జిల్లాలో కిడ్నాపర్ల నుంచి 11 మంది చిన్నారులకు విముక్తి లభించింది. చిన్నారులను కిడ్నాప్ చేసే ఐదుగురు సభ్యుల ముఠాను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నాపర్ల నుంచి విముక్తి లభించిన చిన్నారులను వారి తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు.