12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 88 వేల మెగావాట్ల అదనపు విద్యుత్తు

న్యూఢిల్లీ: 12వ పంచవర్ష ప్రణాళిక (2012-17) కాలంలో దేశంలో 88 వేల మెగావాట్ల అదనపు విద్యుత్తును ఉత్పత్తి చేయాలని ప్రణాళిక సంఘం లక్ష్యంగా నిర్దేశించింది. ఈ మేరకు ప్రణాళిక డాక్యమెంట్‌ను విడుదల చేసింది. కాలం చెల్లిన విద్యుత్తు ప్లాంటును మూసివేయాలని వెల్లడించింది. 88 వేల మెగావాట్ల అదనపు విద్యుత్తు ఉత్పత్తిలో ప్రైవేట్‌ రంగం వాటా 52 శాతంగా నిర్దేశించింది. 11వ పంచవర్ష ప్రణాళికలో 78,577 మెగావాట్లు అదనంగా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా 52 వేల మెగావాట్ల కరెంటు మాత్రమే ఉత్పత్తి జరిగింది.