12-12-12 న ‘కోచ్చడయాన్‌’ విడుదల

చెన్నై : సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న ‘కోచ్చడయాన్‌’ ఆయన పుట్టినరోజు సంధర్భంగా డిసెంబర్‌ 12న విడుదల కానున్నట్లు చెన్నై సమాచారం. రజనీ చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 3డీ హంగులతో తెరకెక్కనున్న ఈచిత్రంలో ఆది, శరత్‌ కుమార్‌, శోభన, రుక్మిణి, హిందీ నటుడు జాకీష్రాఫ్‌ తదితరులు నటిస్తున్నారు. ఇరాన్‌ ఇంటర్‌నేషనల్‌ నిర్మాణంలో చిత్రీకరణ ముగించుకున్న ‘కోచ్చడయాన్‌’ ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉంది. ఇదిలా ఉండగా సినిమా ఆడియో విడుదల, శాటిలైట్‌ హక్కుల గురించి నిర్మాణ వర్గాలు ప్రకటన విడుదల చేశాయి. అందులో రజినీ నటించిన శివాజీ, రోబో తరహాలో ‘కోచ్చడయన్‌’ కూడా భారీహిట్‌ను సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది. తెలుగు, తమిళం, హిందీ, ఆంగ్ల భాషల్లో విడుదలవుతోంది. ‘అవతార్‌’, ‘టిన్‌ టిన్‌’ స్థాయిలో సాంకేతిక సొబగులు అద్దుకుంటోంది. చిత్ర గీతావిష్కరణ కార్యాక్రమాన్ని సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో నిర్వహించాలనుకున్నాం. ఈ సంధర్బంగా కార్బన్‌ సంస్థతో ‘కోచ్చడయాన్‌’ ప్రత్యేక మొబైళ్లు విడుదల చేయనున్నాం. ఇందులో ‘కోచ్చడయాన్‌’ ఫోటోలు, స్క్రీన్‌సేవర్లు, డిజిటల్‌లో రజినీకాంత్‌ సంతకం..వంటి ఆసక్తికరమైన అంశాలుంటాయి. సినిమాను డిసెంబర్‌లో విడుదలచేయాలనుకుంటున్నాం. చిత్ర శాటిలైట్‌ హక్కులను జయ టీవీకి విక్రయించాం. తెలుగు హక్కులను లక్ష్మీ గణపతి ఫిలిమ్స్‌ సొంతం చేసుకుందని తెలిపింది.

తాజావార్తలు