తొలకరి వర్షాలతో పులకరించిన తూర్పు
కాకినాడ,జూన్8(జనం సాక్షి): నైరుతి పలకరింపుతో కురిసన వర్షాలతో ఎండలతో అల్లాడిన ప్రజలకు తొలకరి జల్లులు ఊరటనిచ్చాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో వాతావరణం చల్లబడింది. 3 నుంచి 5 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు తగ్గడంతో ఈ వేసవి నుంచి ఇక గట్టెక్కినట్లేనని ప్రజలు భావిస్తున్నారు. జిల్లాలో రావులపాలెం, కడియం, ఏజెన్సీలోని పలుమండలాల్లో మండలాల్లో రెండో రోజు వర్షాలు కొనసాగాయి. రావులపాలెంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పల్లపు ప్రాంతాల్లోకి నీరు చేరింది. జిల్లాలో అత్యధికంగా 65 మిల్లీవిూటర్ల వర్ష పాతం ఇక్కడే నమోదైనట్లు ఆర్‌ఐ కార్తీక్ తెలిపారు. అలాగే కడియంలో ఉరుములు, మెరు పులతో కూడిన వర్షానికి ప్రజలు భయాందోళన చెందారు. ఏజెన్సీలో పలుచోట్ల కురిసిన వర్షాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం పడడంతో పలుచోట్ల చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. వర్షం మరింత ఎక్కువైతే ఏజెన్సీలో వాగులు పొంగే అవకా శమున్నట్లు మన్యవాసులు చెబుతున్నారు. అలాగే జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం, పిఠాపురం, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి, తాళ ?లరేవు, కరప, పెదపూడి తదితర మండలాల్లో ఓ మోస్తరు చిరుజల్లులు పడ్డాయి. జిల్లావ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఉష్ణోగ్ర తలు ఒక్కసారిగి తగ్గిపోయాయి. /ూవులపాలెం మండలంలోఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా మండలంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండలంలోని పలు గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో అందరూ అప్రమత్తమయ్యారు.